తెలంగాణ

telangana

ETV Bharat / city

Steel plant protest: కేంద్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల హెచ్చరిక..!

ఏపీ హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్​ను నిరసిస్తూ కార్మిక సంఘాల నేతలు స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు. పరిశ్రమను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి చేయి దాటకుండా... కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి.

Steel plant protest
విశాఖ స్టీల్ ప్లాంట్

By

Published : Jul 29, 2021, 1:37 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద కార్మిక నేతలు ఆందోళన చేపట్టారు. ఉక్కు పరిశ్రమ విషయంలో ఏపీ హైకోర్టుకు... కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను నిరసిస్తూ... స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఉద్యమిస్తోంది. ఈ సందర్భంగా.. స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

ఇది అల్లూరి పుట్టిన గడ్డ.. ప్రాణ త్యాగాలకు వెరవం..

తమకు పోరాటాలు చేయడం తెలుసని.. అల్లూరి పుట్టిన గడ్డ ఇదని కార్మికులు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఎంతటి మొండివారైనా సరే.. ప్రాణాలకు తెగించి.. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని.. అవసరమైతే పిల్లాజల్లా అంతా కలిసి.. కుటుంబసభ్యులంతా కలిసి రోడ్లపైకి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా.. ప్రైవేటీకరణ యత్నాలను ఆపాలని వారు డిమాండ్ చేశారు.

"ఎంపీలంతా కలిసి.. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికుల గళాన్ని.. మేము పడుతున్న బాధను.. వినిపించాలి. కేంద్ర ప్రభుత్వం అఫిడవిడ్ దాఖలుతో పరిశ్రమ సిబ్బందిలో, కార్మికుల్లో తీవ్రమైన అలజడి, ఆందోళన కలిగించింది. స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కలిసి.. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేస్తున్నాం. ఆగస్టు 2, 3 తేదీల్లో దిల్లీ జంతర్ మంతర్ లో నిర్వహించనున్న ఆందోళనకు పెద్ద సంఖ్యలో ఉక్కు కార్మికులంతా బయల్దేరి వెళ్తున్నాం. మా ఆవేదనను దిల్లీ వీధుల్లో వినిపించి తీరుతాం. కేంద్ర ప్రభుత్వం గుండెల్లో అలజడి సృష్టించబోతున్నాం. ఉద్యోగాలు తొలగిస్తామని.. ఎవరికీ అడిగే హక్కు లేదని మోదీ ప్రభుత్వం చెబుతోంది. ప్రధాని మోదీ గారూ.. గుర్తు పెట్టుకోండి. పోరాట యోధుడు అల్లూరి పుట్టిన గడ్డ ఇది. అల్లూరి స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం ఎలాగో మాకు తెలుసు. మార్వాడీ కొట్టులో టీ అమ్మేసినట్టు స్టీల్ ప్లాంట్ ను అదానీకి, అంబానీకి అమ్మేయాలని మీరు చూస్తున్నారు. కేంద్రానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లో ఉంది. అవసరమైతే యువ కార్మికులంతా దిల్లీ వెళ్లి.. కేంద్రం వెనక్కు తగ్గేవరకూ పోరాడతామని హెచ్చరిస్తున్నాం. మీరు మోదీ కావచ్చు.. ఎంతటి మొండి వారైనా కావచ్చు.. ప్రాణ త్యాగానికైనా మేం సిద్ధం.. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వం" - స్టీల్ ప్లాంట్ కార్మికులు

భారీ భద్రత మోహరింపు

కార్మికుల ఆందోళన నేపథ్యంలో.. స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో వాతావరణం ఉద్వేగభరితంగా మారింది. పరిపాలనా భవనం వద్ద పెద్ద పరిస్థితి అదుపు తప్పకుండా భారీ సంఖ్యలో సీఐఎస్ఎఫ్ బృందాలు.. పహారా కాస్తున్నాయి.

ఇదీ చదవండి:Car Accident : వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు... వాహనంలో ఐదుగురు!

ABOUT THE AUTHOR

...view details