దేశం మెుత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన.. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన నుంచి ఇంకా స్థానికులు తేరుకోలేదు. మళ్లీ విషవాయువు ప్రభావం చూపిస్తోంది. గ్రామంలో ఇప్పటికీ.. పలువురు స్పృహ తప్పిపడిపోతున్నారు. తాజాగా వెంకటాపురంలో ఇల్లు తూడుస్తూ కరణ జ్యోతి అనే మహిళ కుప్పకూలి పడిపోయింది. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
వెంకటాపురంలో వెంటాడుతున్న విషవాయువు - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు
వెంకటాపురం ప్రజలను స్టైరీన్ విషవాయువు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎన్ని చర్యలు చేపడుతున్నా.. దాని ప్రభావం స్థానికులపై పడుతూనే ఉంది. తాజాగా పలువురు గ్రామస్థులు స్పృహ తప్పిపడిపోవడమే ఇందుకు ఉదాహరణ.
వెంకటాపురంలో వెంటాడుతున్న విషవాయువు