తెలంగాణ

telangana

ETV Bharat / city

Suspended: రూ.100 కోట్ల భూ వ్యవహారం.. తహసీల్దార్‌ సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా చినగదిలి తహసీల్దార్ నరసింహమూర్తిని కలెక్టర్ మల్లికార్జున సస్పెండ్ చేశారు. కొమ్మాదిలో రూ.100 కోట్ల విలువ చేసే భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో తహసీల్దార్​పై వేటు వేశారు. అనంతరం చినగదిలి ఇంఛార్జీ తహసీల్దార్‌గా కిరణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.

Suspended: రూ.100 కోట్ల భూ వ్యవహారం.. తహసీల్దార్‌ సస్పెండ్
Suspended: రూ.100 కోట్ల భూ వ్యవహారం.. తహసీల్దార్‌ సస్పెండ్

By

Published : Sep 9, 2021, 10:29 AM IST

ఏపీ విశాఖ జిల్లా చినగదిలి తహసీల్దార్ నరసింహమూర్తిని సస్పెండ్‌ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ఆదేశాలిచ్చారు. విశాఖలోని కొమ్మాదిలో రూ.100 కోట్లు విలువ చేసే భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. భూముల కొనుగోలుకు ఎలమంచిలి ఎమ్మెల్యే కుమారుడి కంపెనీ యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఫిర్యాదుతో రెవెన్యూ మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

వెబ్‌ల్యాండ్‌లో ఉంచడం, తొలగించడంలో తహసీల్దార్‌ విధివిధానాలు పాటించలేదని ఆర్డీవో విచారణలో తేలింది. దీంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. చినగదిలి ఇన్‌ఛార్జ్‌ తహసీల్దార్‌గా కిరణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి: Love Cheater: భార్యకు విడాకులిస్తానని నమ్మించి.. లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.. ఆ తర్వాత..!

ABOUT THE AUTHOR

...view details