గణేశ్ మహోత్సవ్-2021 పేరుతో బెల్జియం రాజధాని బ్రెసెల్స్‌లో భారతీయులు వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానికంగా ఉన్న భారతీయుల సంఘం సీజన్స్ అండ్ అకేషన్స్ తరఫున... సాగర్ సింగంశెట్టి ఈ వేడుకలను ఏర్పాటు చేశారు.
బ్రెసెల్స్‌లోని తెలుగువారు ఈ వేడుకలకు హాజరయ్యారు. స్థానికంగా ఉన్న పతంగి రాజశ్రీ మట్టి, నేచురల్ కలర్స్‌తో తయారు చేసిన 3 అడుగుల గణేశ్ విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. గణపతి కోసం 15 కిలోల లడ్డూను కూడా సిద్ధం చేశారు. బ్రసెల్స్‌లో ఇలా చవితి వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారని నిర్వాహకులు వెల్లడించారు.