Road Repaired by Villagers: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కొండప్రాంతాల్లోని రహదారులు చిత్తడిగా మారాయి. రోడ్లు బురదమయమై వివిధ గ్రామాలకు వెళ్లడానికి గిరిజనుల అవస్థలు పడుతున్నారు. వాహనాలు ఎక్కడకక్కడే బురదలో కూరుకుపోతున్నాయి. పాడేరు మండలం సలుగు, దేవాపురం, అయినాడ పంచాయతీల నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ఘాట్ రోడ్డు బురదమయమైంది. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
చేయి చేయి కలిపారు.. బురద రోడ్డును బాగు చేసుకున్నారు.. - రోడ్లను బాగు చేసుకున్నారు
Road Repaired by Villagers: ఆ ప్రాంతంలో పంచాయతీల నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ఘాట్ రోడ్డు బురదకూపంగా మారింది. మూడు నెలల్లో రెండు ప్రమాదాలు జరిగి.. ఇద్దరు చనిపోయారు. ప్రభుత్వం స్పందిస్తుందేమోనని ఇన్నాళ్లు ఎదురుచూశారు. వారికి నిరాశే ఎదురయ్యింది. ఇక చేసేదేమీ లేక గ్రామస్థులంతా చేయి చేయి కలిపారు.. రోడ్డు మరమ్మతులకు పూనుకున్నారు. శ్రమదానం చేసి.. రోడ్డును పునరుద్ధరించారు.
ఇప్పటివరకు గత మూడు నెలల్లో రెండు ప్రమాదాలు జరిగి... ఇద్దరు చనిపోయారు. పరిస్థితిపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారుల తీరుతో విసుగు చెందిన చుట్టుపక్కల గ్రామస్థులంతా ఏకమయ్యారు. చేయి చేయి కలిపి.. శ్రమదానంతో రోడ్డు పునరుద్ధరించుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తామే రోడ్డు పునరుద్ధరించుకున్నామని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: