విజయసాయిరెడ్డి(Vijayasai reddy) బెయిల్ రద్దు పిటిషన్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. కౌంటరు దాఖలు చేయాలని విజయసాయిరెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణ ఈనెల 13కు వాయిదా పడింది.
Vijayasai reddy : కౌంటరు దాఖలు చేయాలని విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు ఆదేశం
జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి(Vijayasai reddy) బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టును కోరారు. ఎంపీగా కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా కలిసే విజయసాయిరెడ్డి.. తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయనే విధంగా చిత్రీకరించి సాక్షుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భయం కలిగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే .. జగన్ అక్రమాస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని సీబీఐ జేడీ చేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, ఇది స్వేచ్ఛాయుత విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు.