ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గ్యాంగ్‌వార్ కేసులో ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. త్వరలోనే మరింత మందిని అరెస్టు చేస్తామన్న ఆయన.. రౌడీషీటర్లపై నిఘా తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు. సందీప్, పండు గతంలో సన్నిహితంగా ఉండేవాళ్లని.. కాలక్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సీపీ తెలిపారు. యనమలకుదురులోని 7 సెంట్ల స్థలం వల్ల వివాదం ప్రారంభమైందని.. తొలుత మాట్లాడుకుందామని వచ్చి.. అనంతరం వీరి మధ్య ఘర్షణ చెలరేగిందని వెల్లడించారు.
విజయవాడ గ్యాంగ్‌వార్ కేసు: 7 సెంట్లే వివాదానికి కారణం - విజయవాడ గ్యాంగ్‌వార్‌పై సీపీ ద్వారకా తిరుమలరావు వ్యాఖ్యలు
ఏపీలో విజయవాడ గ్యాంగ్‌వార్‌కు యనమలకుదురులోని 7 సెంట్ల స్థలమే వివాదానికి కారణమని సీపీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. ఇప్పటికే 13 మందిని అరెస్టు చేశామన్న ఆయన.. మరికొంతమందిని త్వరలోనే అరెస్టు చేస్తామని అన్నారు. నిందితుల నుంచి రాడ్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నామన్న ఆయన.. నగరంలో రౌడీషీటర్లపై నిఘా తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
పోలీసులు వెళ్లేసరికే కర్రలు, రాళ్లు, రాడ్లు, కత్తులు, బ్లేడ్లతో దాడులు చేసుకున్నారని సీపీ తెలిపారు. అప్పటికే చాలామంది గాయపడ్డారని.. 6 బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నామని అన్నారు. నిందితుల నుంచి కత్తులు, కోడి కత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. విజయవాడలో ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటున్నామన్న సీపీ.. ఇలాంటివి మరోసారి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'మర్డర్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగదీశ్ రెడ్డి.. మంత్రా?'