విజయ డెయిరీ పాల ధరలు పెంపు.. కొత్త ధరలు ఇవే.. - new price list of vijaya dairy milk
15:43 December 31
విజయ డెయిరీ పాల ధరలు పెంపు.. రేపటి నుంచి అమలు
Vijaya Dairy milk price hike: రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ పాల ధరలు పెరిగాయి. లీటరు పాలపై 2 రూపాయలు, హోల్ మిల్క్‌పై 4 రూపాయల చొప్పున విక్రయ ధరలు పెంచినట్లు ఆ సంస్థ వెల్లడించింది. పెరిగిన ఈ ధరలు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు పెంచినట్టు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి.మల్లికార్జునరావు తెలిపారు. ధరలు పెరిగిన దృష్ట్యా పాల వినియోగదారులు సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..
పాల రకం | క్వాంటిటీ | ప్రస్తుత ధర(రూ.లో) | పెరిగిన ధర(రూ.లో) |
డబుల్ టోన్డ్ పాలు | 200 మి.లీ. | 9 | 9.50 |
డబుల్ టోన్డ్ పాలు | 300 మి.లీ. | 14 | 15 |
డబుల్ టోన్డ్ పాలు | 500 మి.లీ. | 22 | 23 |
ఆవు పాలు | 500 మి.లీ. | 24 | 25 |
టోన్ట్ పాలు | 200 మి.లీ. | 10 | 10.50 |
టోన్డ్ పాలు | 500 మి.లీ. | 24 | 25 |
టోన్డ్ పాలు | లీటర్ | 47 | 49 |
టోన్డ్ పాలు | 6 లీటర్లు | 276 | 288 |
స్టాండైజ్డ్ పాలు | 500 మి.లీ. | 26 | 27 |
హోల్ పాలు | 500 మి.లీ. | 31 | 33 |
డైట్ పాలు | 500 మి.లీ. | 21 | 22 |
టీ స్పెషల్ | 500 మి.లీ. | 23 | 24 |
ఇదీ చూడండి: