నేరస్థులను గుర్తించడంలో సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ పరిశోధనలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీని సందర్శించిన ఆయన.. పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ లేబొరేటరీని ప్రారంభించారు. సీడీఎఫ్డీలో పలు విభాగాలను పరిశీలించారు.
' ప్రజల జీవన ప్రమాణాలు మార్చడమే పరిశోధనాసంస్థల లక్ష్యం' - Pediatric Rare Genetic Disorders Laboratory
ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేదా పరిశోధన అయినా అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు సౌకర్యవంతంగా మార్చటమే లక్ష్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీని సందర్శించిన ఆయన.. పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్స్ లేబొరేటరీని ప్రారంభించారు.
జన్యు రుగ్మతలపై పరిశోధనలతో పాటు నాణ్యమైన సేవలు అందించటం డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, పరిశోధన కేంద్రం ప్రత్యేకత అని వెంకయ్య అన్నారు ఆధునిక కాలంలో నేరాలు సైతం అనేక రకాలుగా జరుగుతున్నాయన్న ఆయన.. న్యాయవ్యవస్థ, పరిశోధన సంస్థలు నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సీడీఎఫ్‌డీ చేస్తున్న కృషి దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని వెల్లడించారు.
ఇటీవలే 25వ వసంతంలోకి ప్రవేశించిన సీడీఎఫ్‌డీ.... ఇప్పటికే కావాల్సిన అనుభవాన్ని సాధించిందని వెంకయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంస్థపై ప్రజల అంచనాలు సైతం అదేస్థాయిలో పెరుగుతాయని గుర్తుంచుకోవాలని సూచించారు.
- ఇదీ చూడండి :న్యాయవాద దంపతుల కేసులో మలుపులు