అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ కోసం హైదరాబాద్ సీసీఎంబీలో ఏర్పాటు చేసిన లాకోన్స్ లేబొరేటరీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) సందర్శించారు. ఇందులో నేషనల్ వైల్డ్ లైఫ్ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్, సహాయక పునరుత్పత్తి ల్యాబ్‌లు ఉన్నాయి. దీన్ని పరిశీలించిన అనంతరం.. శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులతో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు. అనంతరం మినీ జంతు ప్రదర్శనశాలను వీక్షించారు. రాతి కట్టడాలను పరిరక్షించేలా నిర్మించిన భవన సముదాయాన్ని పరిశీలించారు.
Venkaiah Naidu : అంతరిస్తున్న జీవజాతులను కాపాడుకోవాలి
అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ కోసం హైదరాబాద్ సీసీఎంబీలో ఏర్పాటు చేసిన. లాకోన్స్ ల్యాబ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) సందర్శించారు. వన్యప్రాణులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలతో ముచ్చటించారు.
లాకోన్స్ సిబ్బంది, సెంట్రల్ జూ అధికారులు సంయుక్తంగా రచించిన ఇంట్రడక్షన్ టూ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్వర్జేషన్ అనే పుస్తకాన్ని వెంకయ్య(Venkaiah Naidu) విడుదల చేశారు. లాకోన్స్ వంటి పరిశోధన సంస్థలు, జంతు ప్రదర్శన శాలలు కలిసి పనిచేయాలని సూచించారు. అంతరించి పోతున్న జీవజాతులను కాపాడుకోవాలని చెప్పారు. జంతువుల జన్యు పదార్థాలను దాచి ఉంచడమేగాక.. అంతరించిపోతున్న జీవులను సహాయ పునరుత్పత్తి పద్ధతుల ద్వారా కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మహమూద్ అలీ, సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి, లాకోన్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ కార్తికేయన్ వాసుదేవన్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి :CC Footage: మొండెం లేని తల... కుక్క పనేనా?