ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu Visakha Tour) నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఏపీలోని విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ పోర్ట్ అతిథి గృహంలో బస చేశారు. నేడు అరకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకుకు విస్టా డోమ్ కోచ్‌లతో ప్రత్యేక రైలును వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.
Vice President Venkaiah Naidu tour: విశాఖలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన - Vice President Visakha Tour
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Visakha Tour) ఏపీలోని విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఉపరాష్ట్రపతికి అధికారులు ఘనస్వాగతం పలికారు. నేడు విశాఖ నుంచి అరకుకు విస్టా డోమ్ కోచ్‌లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.
Venkaiah Naidu Visakha Tour
ఉదయం 11 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం మీద గల విస్టా డోమ్ కోచ్‌లతో కూడిన ప్రత్యేక రైలును ఉపరాష్ట్రపతి(Vice President Visakha Tour) ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా స్టేషన్లలో ఆగనుంది. తిరిగి అరకు నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు విశాఖ చేరుతుంది.