Vice President Granddaughter Wedding : ఘనంగా ఉపరాష్ట్రపతి మనవరాలి వివాహం - ఉపరాష్ట్రపతి మనవరాలి వివాహం
Vice President Granddaughter Wedding : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఆయన తనయుడు హర్షవర్ధన్- రాధ దంపతుల కుమార్తె నిహారికతో.. హైదరాబాద్‌కు చెందిన చుండూరు వెంకట లక్ష్మణరావు, మాధురీ దేవీ దంపతుల కుమారుడు రవితేజ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
Vice President Granddaughter Wedding
Vice President Granddaughter Wedding : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి తనయుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారిక, హైదరాబాద్‌కు చెందిన చుండూరు వెంకట లక్ష్మణరావు, మాధురీ దేవి దంపతుల కుమారుడు రవితేజల వివాహం గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం జీఎమ్మార్ ఎరీనాలో వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
- ఇదీ చదవండి :Gold Price Today: ఏపీ, తెలంగాణలో తగ్గిన పసిడి ధర