దిల్లీలో జరిగే అల్లర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో జరిగిన అల్లర్లల్లో ఇప్పటి వరకు 34 మంది చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. సీఏఏ కారణంగానే ఈ అల్లర్లలు జరుగుతోన్నయన్నారు. దేశం నుంచి వెలివేస్తారని ఓ వర్గం తీవ్ర భయాందోలనతో బతుకుతోందన్నారు.
దిల్లీ అల్లర్లపై కేంద్రం చర్యలు తీసుకోవాలి: వీహెచ్
దిల్లీలో అల్లర్లకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు చెయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
దిల్లీ అల్లర్లపై కేంద్ర చర్యలు తీలుకోవాలి: వీహెచ్
భాజపా నాయకులు రెచ్చగొట్టి హింసను ప్రేరేపించి... శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అల్లర్లకు మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ప్రణయ్ హత్యకేసులో వాదనలు పూర్తి...
Last Updated : Feb 27, 2020, 8:56 PM IST