రాష్ట్ర క్రీడాశాఖ ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, నిజాం కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ రాఠోడ్.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. ఓయూ క్రీడల మైదానంలో సింథటిక్ ట్రాక్, టెన్నిస్ కోర్టులు, మహిళల స్మిమ్మింగ్ పూల్ ఏర్పాటుకు కేంద్ర క్రీడా శాఖ రూ.13.5కోట్లు విడుదల చేసింది.
కేటీఆర్‌కు వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీకాంత్ కృతజ్ఞతలు - హైదరాబాద్ వార్తలు
ఓయూ మైదానంలో పలు క్రీడల ఏర్పాటుకు కేంద్ర క్రీడా శాఖ రూ.13.5కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కలిసి క్రీడాశాఖ ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, నిజాం కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ రాఠోడ్ కృతజ్ఞతలు తెలిపారు.
కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి
ఈ సందర్భంగా వారు మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఓయూ మైదానంలో పలు క్రీడల ఏర్పాటుకు కేంద్ర క్రీడా శాఖ జీవోను విడుదల చేయడంపై లక్ష్మీకాంత్ రాఠోడ్, వెంకటేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:'పద్మశ్రీ' కనకరాజుకు మంత్రి అల్లోల సన్మానం