తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీశైలం ప్రమాద ఘటనపై ఉత్తమ్​ తీవ్ర దిగ్భ్రాంతి - శ్రీశైలం ప్రమాద ఘటన

శ్రీశైలం విద్యుత్​ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి​ స్పందించారు. ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడండం తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రమాదానికి గల కారణాలను వెంటనే బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరారు.

శ్రీశైలం ప్రమాద ఘటనపై ఉత్తమ్​ తీవ్ర దిగ్భ్రాంతి
శ్రీశైలం ప్రమాద ఘటనపై ఉత్తమ్​ తీవ్ర దిగ్భ్రాంతి

By

Published : Aug 21, 2020, 6:53 PM IST

శ్రీశైలం విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. మృతుల్లో సూర్యాపేటకు చెందిన ఏఈ సుందర్‌ నాయక్‌ కూడా ఉన్నారన్న ఉత్తమ్‌.. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. మంచి భవిష్యత్తు ఉన్న ఇంజినీరు ఇలా ప్రమాదానికి లోనై మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రమాదానికి గల కారణాలను వెంటనే బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.


ఇవీ చూడండి:'ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు బయటకు రావాలి'

ABOUT THE AUTHOR

...view details