తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు! - గరికపాటి మోహనరావు వార్తలు

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారిలో తెలుగు వ్యక్తి కూడా ఉండబోతున్నారు. మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు పేరు ఈ జాబితాలో ఉండనున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సీటు దక్కించుకున్న గరికపాటి.. అనంతరం భాజపాలో చేరారు. నాటి హామీ మేరకు కమలం పార్టీ అగ్రనాయకత్వం యూపీ నుంచి రాజ్యసభకు గరికపాటి పేరుక ఖరారు చేసినట్లు సమాచారం.

garikapati had chances to got seat
మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు

By

Published : Oct 26, 2020, 4:46 PM IST

Updated : Oct 26, 2020, 4:52 PM IST

ఇవాళ సాయంత్రంలోపు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థులను భాజపా అగ్ర నాయకత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. యూపీలోని 10 స్థానాలకు, ఉత్తరాఖండ్​లోని ఒక స్థానానికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది కమలం పార్టీ. నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారం చివరి తేదీ కాగా.. ఈ సాయంత్రం లోపు అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశాలున్నాయి.

యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితాలో మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు పేరు ఉన్నట్లు సమాచారం. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన గరికపాటి.. అనంతరం కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరినప్పుడు రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరణ చేస్తామని భాజపా అగ్రనాయకత్వం హామీ ఇచ్చింది. నాటి హామీ మేరకు ఇప్పుడు అవకాశం కల్పించే యోచనలో కమలం పెద్దలు ఉన్నట్లు సమాచారం.

ఇవీ చూడండి:బిహార్​ బరి: 'బ్రాండ్​ తేజస్వీ'తోనే ఎన్​డీఏ పోరు!

Last Updated : Oct 26, 2020, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details