తెలంగాణ

telangana

ETV Bharat / city

'సైబర్​ నేరాలు అరికట్టేందుకు కొత్త చట్టాలు తీసుకొస్తాం' - కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

సైబర్​ సెక్యూరిటీ విషయంలో సమన్వయమే కీలకమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి. ఈ రంగంలో పెరుగుతున్న నేరాల నియంత్రణకు... అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

union minister of state kishan reddy told that the central government will bring new acts to prevent cyber crime

By

Published : Aug 10, 2019, 12:59 PM IST

Updated : Aug 10, 2019, 7:13 PM IST

సైబర్​ నేరాలు అరికట్టేందుకు కొత్త టెక్నాలజీతో పాటు, కొత్త చట్టాలు తీసుకువస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. హైదరాబాద్​ ఖైరతాబాద్​ విశ్వేశ్వరయ్య భవన్​లో సైబర్​ సెక్యూరిటీ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైబర్​ సెక్యూరిటీలో మరిన్ని పరిశోధనలు జరగాలని, సైబర్​ నేరాల అప్పగింతలో ఇతర దేశాలతో కేంద్రం ఒప్పందాలు చేసుకుంటోందని తెలిపారు. ఈ సదస్సులో హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​తో పాటు సైబర్​ భద్రత చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ అధికారి పాల్గొన్నారు.

'సైబర్​ నేరాలు అరికట్టేందుకు కొత్త చట్టాలు తీసుకొస్తాం'
Last Updated : Aug 10, 2019, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details