paddy procurement: ధాన్యం సేకరణపై పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన
13:32 December 01
ధాన్యం సేకరణపై పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన
paddy procurement: వరిసాగు, ధాన్యం సేకరణపై భాజపా నేతలు, తెలంగాణ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ధాన్యం సేకరణపై తెదేపా ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు.. కేంద్ర ఆహార, ప్రజాసరఫరాల మంత్రిత్వశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. గత మూడేళ్లలో సేకరించిన ధాన్యం వివరాలు వెల్లడించింది.
తెలంగాణలో 2018-19లో 51.90 లక్షల మెట్రిక్ టన్నులు, 2019-20లో 74.54 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-21లో 94.53 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఏపీ నుంచి 2018-19లో 48.06 లక్షల మెట్రిక్ టన్నులు, 2019-20లో 55.33 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-21లో 56.67 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు చెప్పింది.
ఇవీచూడండి: