ఎల్బీనగర్ మన్సూరాబాద్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలోని ఉమానాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య ఉమామహేశ్వరుల పరిణయ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనులారా వీక్షించిన భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఉమానాగలింగేశ్వర క్షేత్రంలో శివపార్వతుల పరిణయం - umanagalingeshwara kalyanam in central bank colony
ఉమామహేశ్వరుల కల్యాణోత్సవాలతో శైవక్షేత్రాలు కైసాలాన్ని తలపించాయి. ఎల్బీనగర్ సెంట్రల్ బ్యాంక్‌లోని ఉమా నాగలింగేశ్వర ఆలయంలో శివపార్వతుల పరిణయాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉమానాగలింగేశ్వర క్షేత్రంలో శివపార్వతుల పరిణయం
Last Updated : Feb 22, 2020, 9:04 PM IST