తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న రెండు కంపెనీలు - తెలంగాణలో పెట్టుబడులు

రాష్ట్రంలో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న రెండు కంపెనీలు
రాష్ట్రంలో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న రెండు కంపెనీలు

By

Published : Oct 27, 2020, 2:32 PM IST

Updated : Oct 27, 2020, 5:06 PM IST

14:30 October 27

రాష్ట్రంలో రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న రెండు కంపెనీలు

 రాష్ట్రానికి మరో రెండు భారీ పెట్టుబడులు వచ్చాయి. రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు గ్రాన్యూల్స్ ఇండియా, లారస్ ల్యాబ్స్ తమ పెట్టుబడులను ప్రకటించాయి. ఈ రెండు సంస్థలు హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో తమ తయారీ యూనిట్లను నెలకొల్పనున్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ను ప్రగతి భవన్‌లో కలిసిన ఆయా సంస్థల ప్రతినిధులు ఈ మేరకు పెట్టుబడుల ప్రకటన విడుదల చేశారు. 


గ్రాన్యూల్స్ ఇండియా రూ.400 కోట్లు..

జినోమ్ వ్యాలీలో రెండు ఫార్మా కంపెనీలు రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన గ్రాన్యూల్స్ ఇండియా.. తయారీ యూనిట్ కోసం రూ.400 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 1600 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ తెలిపింది. ఈ పెట్టుబడితో వెయ్యి కోట్ల డోసులను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. గ్రాన్యూల్స్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా 8 ప్రాంతాలు తయారీ యూనిట్లను కలిగి ఉంది. మొత్తం 75 దేశాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ ఇంటర్మీడియట్ యూనిట్‌ను హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న గాగిల్లాపూర్ వద్ద కలిగి ఉంది. తమ కంపెనీకి సంబంధించిన పెట్టుబడిని అధికారికంగా ప్రకటించేందుకు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ ప్రగతి భవన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ను కలిశారు. 

లారస్‌ ల్యాబ్స్‌ రూ.300 కోట్లు

మరో ప్రముఖ ఫార్మాస్యూటికల్ తయారీ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ కూడా రూ.300 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఆ సంస్థ సీఈవో చావ సత్యనారాయణ మంత్రి కేటీఆర్​ను కలిశారు. లారస్‌ ల్యాబ్స్‌ రెండు విడతల్లో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 500 కోట్ల డోసుల సామర్ధ్యం కలిగిన ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ కోసం ఈ పెట్టుబడి ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా సంస్థలకు మంత్రి కేటీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. రెండు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:చక్రవడ్డీ మాఫీ పథకాన్ని అమలు చేయండి: ఆర్​బీఐ

Last Updated : Oct 27, 2020, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details