కృష్ణా జిల్లా విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలోని ఓ ఇంటిపై శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిగింది. కొందరు వ్యక్తులు తమ ఇంటిపై కర్రలు, కారంతో దాడికి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలపైనా విచక్షణారహితంగా వ్యవహరించారని వాపోయారు.
పాత కక్షలతో ఓ ఇంటిపై కర్రలు, కారంతో దాడి - రాజరాజేశ్వరిపేటలో క్రై వార్తలు
ముందు చిన్న ఘర్షణతో మొదలైంది. మాటమాట పెరిగి కర్రలతో, కారం పొడితో దాడిచేసుకునే వరకూ వచ్చింది. పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఏపీ కృష్ణా జిల్లా విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో చోటు చేసుకుంది.
పాత కక్షలతో ఓ ఇంటిపై కర్రలు, కారంతో దాడి
ఘటనలో సుభాని అపస్మాకర స్థితిలోకి చేరుకోగా.. అతడ్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.