దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్న తితిదే మరికొన్ని ఆంక్షలనూ విధించింది. ఇకపై టికెట్లు ఉండి నడక మార్గంలో వచ్చే వారిని ముందు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి, వాహనాల్లో వచ్చే వారిని ముందు రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది.
తిరుమల వెళ్తున్నారా..? ఈ ఆంక్షలు తెలుసుకోండి..! - కరోనా నేపథ్యంలో తిరుమలలో నిబంధనలు న్యూస్
ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో తిరుమలకు వచ్చే భక్తులకు తితిదే ఆంక్షలు విధించింది. కొండపై భక్తులు.. అధిక సంఖ్యలో లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.
తితిదే ఆంక్షలు
కరోనా కేసులు పెరుగుతుండడంతో పరిమిత సంఖ్యలో టికెట్లను జారీ చేస్తున్న తితిదే.. కొండపై భక్తులు అధిక సంఖ్యలో లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.
ఇదీ చదవండి:పుదుచ్చేరిలో ఆ ఓటర్ల వద్దకే బ్యాలెట్ బాక్స్