తెలంగాణ

telangana

ETV Bharat / city

సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏకాంత నిర్వహణ నిర్ణయం భేష్ : స్వరూపానంద - thirumala brahmotsavalu

ప్రముఖ పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్ రిషికేశ్​లోని విశాఖ శ్రీ శారద పీఠం ఆశ్రమంలో ఉన్న స్వరూపానందేంద్ర స్వామీజీని... తితిదే ఛైర్మన్, ఆలయ ఈవో, అదనపు ఈవోను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వామిజీకి అందజేశారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏకాంత నిర్వహణ నిర్ణయం భేష్ : స్వరూపానంద
సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏకాంత నిర్వహణ నిర్ణయం భేష్ : స్వరూపానంద

By

Published : Sep 6, 2020, 10:32 PM IST

శ్రీవారి సంకల్పంతోనే తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఉద్ఘాటించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రిషికేశ్​లోని విశాఖ శ్రీ శారద పీఠం ఆశ్రమంలో... మూడు నెలలుగా చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వామీజీని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిశారు. అనంతరం తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

అవి విశేషంగా ఆకట్టుకున్నాయి...

కరోనా వంటి విపరీత విపత్కర పరిస్థితుల్లో తితిదే చేపట్టిన అనేక ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సుందరకాండ, విరాటపర్వ పారాయణాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయని స్వరూపానందేంద్ర స్వామి కొనియాడారు. కరోనా కారణంగా అర్చకులకు, భక్తులకు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా... సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు

ABOUT THE AUTHOR

...view details