తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 4:30 PM IST

ETV Bharat / city

తితిదే ఆస్తుల వేలంపై ఏపీ హైకోర్టులో విచారణ

తితిదే ఆస్తుల వేలంపై దాఖలైన పిటిషన్​పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ ప్రస్తావించిన అంశాలతో పాటు.. వేలం విషయంలో తీసుకున్న చర్యలపై వివరణతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ద్విసభ్య ధర్మాసనం సూచించింది.

ap high court
తితిదే ఆస్తుల వేలంపై ఏపీ హైకోర్టులో విచారణ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం పిటిషన్​పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వేలం ప్రక్రియను మే నెలలోనే నిలిపివేశామని.. దీనికి సంబంధించి మే 28, గత నెల 30న వివరాలు సమర్పించినట్లు తితిదే స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ మజ్జి సూరిబాబు తెలిపారు. పిటిషనర్ ప్రస్తావించిన అంశాలతో పాటు, వేలం విషయంలో తీసుకున్న చర్యలపై సమగ్రమైన వివరణతో కౌంటర్​ దాఖలు చేయాలని ద్విసభ్య ధర్మాసనం సూచించింది.

తితిదే భూములు విక్రయించటం అన్యాయమని.. భవిష్యత్తులోనూ భూములు విక్రయించకుండా ఉండేందుకు చర్యలు తీసుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రత్యేకంగా ఒక జ్యూడిషియల్ కమిటీ వేసి, ఆస్తులను వాటి పర్యవేక్షణలో ఉంచాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు.

ఇవీచూడండి:పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుంది: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details