తెలంగాణ

telangana

ETV Bharat / city

Devotees problems in Tirumala: కార్మికుల ఆందోళన.. భక్తులకు తప్పని ఇబ్బందులు - tirumala latest news

తిరుమలలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. ఫలితంగా గదుల్లో పరిశుభ్రత సరిగా లేక భక్తులకు గదుల కేటాయింపు నిలిచిపోయింది. దీంతో స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Devotees problems in Tirumala
తిరుమలలో కార్మికుల ఆందోళన

By

Published : Dec 8, 2021, 2:39 PM IST

Devotees problems in Tirumala: తిరుమలలో పారిశుద్ధ్య ఒప్పంద కార్మికుల ఆందోళనతో.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తితిదే ఎఫ్‌ఎమ్‌ఎస్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో పనిచేసే కార్మికులు.. తమను తితిదే కార్పొరేషన్​లో కలపాలంటూ వారం రోజులుగా విధులు బహిష్కరించి, ఆందోళన చేస్తున్నారు. దీంతో.. పారిశుద్ధ్య పనుల్లో ఇబ్బందులు తలెత్తాయి.

గుత్తేదారు సంస్థలు.. అరకొర కార్మికులతో గదులను శుభ్రం చేయిస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో పనులు జరగట్లేదు. ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. గదులను శుభ్రం చేయకపోవడంతో.. భక్తులకు కేటాయించడాన్ని తితిదే ఈ రోజు నిలిపివేసింది. ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి వేచి ఉన్నా.. ఇప్పటికీ గదిని కేటాయించలేదని, అడిగితే సరైన సమాధానం చెప్పే వారు కరవయ్యారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీచదవండి :Omicron: ఒమిక్రాన్​ కలవరం... ఫిబ్రవరిలో తారస్థాయికి చేరుతుందా?

ABOUT THE AUTHOR

...view details