తితిదే పాలకమండలి రూ.2,937కోట్లతో 2021-22 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన... తిరుమల అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం జరిగింది. ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని తితిదే ఛైర్మన్ అన్నారు. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయాలని నిర్ణయించామన్నారు.
దేశంలోని అన్ని కల్యాణ మండపాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే వేద పాఠశాలను ఎస్వీ వేద విజ్ఞానపీఠంగా పేరు మార్చాలని తీర్మానించారు. బర్డ్ ఆస్పత్రి పాతభవనంలో పిల్లల ఆస్పత్రి ఏర్పాటుకు రూ.9కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. నెయ్యి నిల్వ సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. తిరుమలలో విద్యుత్ వాడకంపై క్రమబద్ధీకరణ చర్యలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.