తెలంగాణ

telangana

ETV Bharat / city

Anjanadri: 'హనుమంతుడి జన్మస్థలం'పై చర్చ - 'హనుమంతుడి జన్మస్థలం'పై చర్చ

ఆంజనేయుడి జన్మస్థలంపై తితిదేతో.. కర్ణాటకకు చెందిన శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మధ్య.. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో చర్చ ప్రారంభమైంది. ట్రస్టు ఫౌండర్ గోవిందానంద సరస్వతి, తితిదే పండిత కమిటీ సభ్యులు భేటీలో పాల్గొన్నారు.

discussion started on hanuman birth place
discussion started on hanuman birth place

By

Published : May 27, 2021, 1:14 PM IST

హనుమాన్‌ జన్మస్థలంపై ఏపీలోని తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో చర్చ ప్రారంభమైంది. తిరుమలలోని అంజనాద్రి.. మారుతి జన్మస్థలంగా శ్రీ రామ నవమి రోజు తితిదే ప్రకటన చేసింది. కర్ణాటక హంపిలోని శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు.. ఈ ప్రకటనపై అభ్యంతరం చెప్పింది. ఇప్పటికే పలుమార్లు తితిదేకు లేఖలు రాసింది.

ఈ విషయంపై భేటీ అయ్యేందుకు తితిదే పండిత కమిటీ అంగీకరించింది. ఈ మేరకు.. నేడు తితిదే పండిత కమిటీ సభ్యులు, ఈవో ధర్మారెడ్డి, ట్రస్టు ఫౌండర్ గోవిందానంద సరస్వతి సంవాదానికి హాజరయ్యారు. చర్చల అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:'కొత్త పార్టీ పరిష్కారం కాదు.. అందరం ఏకమవుదాం'

ABOUT THE AUTHOR

...view details