తెలంగాణ

telangana

ETV Bharat / city

'చవితి వేళ  కరెంటు తీగలకు కొండీలు తగిలించొద్దు' - tsspdcl cmd raghumareddy says power connection should be taken for ganesh utsav

గణేశ్​ ఉత్సవాల్లో భాగంగా మండపాల్లో వినియోగించే విద్యుత్​ కోసం టీఎస్ఎస్​​పీడీసీఎల్ సంస్థ ఎల్​.టీ. తాత్కాలిక విద్యుత్​ కనెక్షన్లను మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్​ సర్కిళ్ల సూపరింటెండెంట్​లకు పలు ఆదేశాలు జారీ చేసింది.

'కరెంటు తీగలకు కొండీలు తగిలించొద్దు'

By

Published : Aug 20, 2019, 7:20 PM IST

'కరెంటు తీగలకు కొండీలు తగిలించొద్దు'

గణేశ్​ ఉత్సవాలకు వాడే విద్యుత్​ను కరెంట్​ తీగలకు కొండీలు తగిలించి తీసుకుని వినియోగించడాన్ని నేరంగా పరిగణిస్తామని ఎస్​పీడీసీఎల్​ సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. గణేశ్​ మండప నిర్వాహకులు విధిగా విద్యుత్​ కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు.

మండప నిర్వాహకులకు ప్రత్యేక టారీఫ్​లను ఏర్పాటు చేశారు. 250-500 వాట్ల వినియోగానికి రూ.1000, అలాగే 500-1000 వాట్లకు రూ.1500లు, ఆపైన వినియోగించే ప్రతి 500 వాట్ల విద్యుత్​ వాడకానికి రూ.750 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 2018-19 నిబంధనల ప్రకారం తాత్కాలిక సరఫరా కేటగిరిలో ప్రతి యూనిట్​కు రూ.11, కిలోవాట్​కు రూ.21లు నెల చొప్పున ఫిక్స్​డ్ విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details