తెలంగాణ

telangana

'మా పోరాటానికి మద్దతు ఎందుకు ఇవ్వడం లేదు'

By

Published : Oct 14, 2019, 10:48 AM IST

ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ సంఘాల మద్దతు కోరలేదనడంలో వాస్తవం లేదని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. తమ పోరాటం న్యాయమైనదే అని భావించినప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు ఎన్జీవోల మద్దతు?

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు ఎన్జీవోల మద్దతు?

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల మద్దతు అవసరమని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మె ప్రారంభానికి ముందే ఎన్జీవో సంఘాలతో మాట్లాడి తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. నాలుగు నెలల నుంచి యాజమాన్యానికి నోటీసు ఇచ్చిన... ప్రతి సందర్భంలో వారిని సంప్రదించామని స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ పోరాటం న్యాయమైనదే అని ఉద్యోగ సంఘాలు అంగీకరించినప్పుడు మద్దతు తెలపడానికి ఇబ్బంది ఏంటని అశ్వత్థామ రెడ్డి ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details