Bus Pass Charges hike: ప్రయాణికులకు ఆర్టీసీ వరస షాకులిస్తోంది. తాజాగా బస్పాసుల ధరను అమాంతం పెంచేసింది. పాసుల ధరలను గరిష్ఠంగా రూ.500 పెంచింది. ఈనెల 18న చిల్లర సమస్య పరిష్కారం కోసమని ఛార్జీలను రౌండప్ చేసిన ఆర్టీసీ... ఇవాళ ఉదయం ప్రయాణికుల సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో 5 రూపాయలు.. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచింది. ఆర్డినరీ బస్‌పాస్ ధర రూ.950 నుంచి రూ.1,150కి పెంచింది. పుష్పక్ పాస్ రూ.2,500 నుంచి రూ.3,000కు పెంచింది. పెంచిన బస్‌పాస్ ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు. త్వరలోనే ఆర్టీసీ టికెట్ ఛార్జీలు సైతం పెంచనున్నట్లు యాజమాన్యం సంకేతాలు ఇచ్చింది.
Bus Pass Charges hike: భారీగా పెరిగిన బస్‌పాస్ ఛార్జీలు - భారీగా పెరిగిన బస్‌పాస్ ఛార్జీలు
Bus Pass Charges hike: భారీగా పెరిగిన బస్‌పాస్ ఛార్జీలు
09:12 March 29
Bus Pass Charges hike: భారీగా పెరిగిన బస్‌పాస్ ఛార్జీలు
జనరల్ బస్ టికెట్ పాసుల కేటగిరిలో...
- ఆర్డినరీ బస్‌పాస్ ఛార్జీ రూ.950 నుంచి రూ.1,150కి పెంపు
- మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,070 నుంచి రూ.1,300కు పెంపు
- మెట్రో డీలక్స్ రూ.1,185 నుంచి రూ.1,450కి పెంపు
- పుష్పక్ పాస్ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెంపు
ఎన్‌జీవో బస్‌పాస్‌ల కేటగిరీలో..
- ఆర్డినరీ బస్‌పాస్ ఛార్జీ రూ.320 నుంచి రూ.400కి పెంపు
- మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.450 నుంచి రూ.550కి పెంపు
- మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700కి పెంపు
- ఎంఎంటీఎస్- ఆర్టీసీ కోంబో టికెట్ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: TSRTC CHARGES: ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఛార్జీల మోత..