తెలంగాణ

telangana

ఆదాయ మార్గం: డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలపై ఆర్టీసీ దృష్టి

By

Published : Sep 29, 2020, 5:53 AM IST

ఆదాయ మార్గాలపై ఆర్టీసీ దృష్టి సారిస్తోంది. జౌత్సాహికులైన అభ్యర్థులకు భారీవాహనాల డ్రైవింగ్‌ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 33 జిల్లా కేంద్రాల్లో త్వరలో ప్రారంభం కానున్న ఈ కేంద్రాల ద్వారా జౌత్సాహికులకు తక్కువ ధరలతో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రూ.15,600 ఆర్టీసీకి చెల్లిస్తే.. నెలరోజుల పాటు సంస్థకు చెందిన సీనియర్‌ డ్రైవర్‌తో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది.

ఆదాయ మార్గం: డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలపై ఆర్టీసీ దృష్టి
ఆదాయ మార్గం: డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలపై ఆర్టీసీ దృష్టి

సరకు రవాణా పేరిట కార్గోసేవలను కొనసాగిస్తున్న ఆర్టీసీ.. మరిన్ని ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. జౌత్సాహికులైన అభ్యర్థులకు భారీవాహనాల డ్రైవింగ్‌ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ సహా 11 రీజియన్‌ పరిధిలో డ్రైవింగ్‌ శిక్షణా కేంద్రాల నిర్వహణకు రూపకల్పన చేసింది. 33 జిల్లా కేంద్రాల్లో త్వరలో ప్రారంభం కానున్న ఈ కేంద్రాల ద్వారా జౌత్సాహికులకు తక్కువ ధరలతో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

చిన్నవాహనాలు నడపగలిగి.. డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది కాలం పూర్తైన వారందరూ దరఖాస్తు చేసుకునే వారిని అర్హులుగా ప్రకటించింది. రూ.15,600 ఆర్టీసీకి చెల్లిస్తే.. నెలరోజుల పాటు సంస్థకు చెందిన సీనియర్‌ డ్రైవర్‌తో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. శిక్షణకు వినియోగించేలా ప్రత్యేక బస్సులను సైతం అధికారులు ఎంపిక చేశారు.

ఇవీ చూడండి:ఆదుకోవాల్సిన యాజమాన్యమే.. వాడుకుంది!

ABOUT THE AUTHOR

...view details