తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీకి వెళ్లే టీఎస్​ ఆర్టీసీ బస్సులు నేటి నుంచి బంద్‌ - కరోనా రెండో దశ

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్​కు నడిపే ఆర్టీసీ బస్సులను నేటి నుంచి నడపడంలేదని టీఎస్​ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా... కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే బస్సులు నడుపుతున్నామని వెల్లడించింది. ఏపీలో పరిస్థితులను బట్టి... తిరిగి ఎప్పుడు బస్సులను పునరుద్ధరిస్తామో ప్రకటిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

tsrtc decided to stop services to ap from today
tsrtc decided to stop services to ap from today

By

Published : May 5, 2021, 5:11 PM IST

Updated : May 5, 2021, 6:16 PM IST

కరోనా రెండో దశ ఉద్ధృతితో... ఆంధ్రప్రదేశ్​లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున ఐదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజారవాణా వ్యవస్థను కూడా బంద్ చేశారు. కర్ఫ్యూ మినహా మిగిలిన కొన్ని గంటల వ్యవధిలో ప్రయాణించేవారు తక్కువగా ఉంటారని.. బస్సులు నడిపినప్పటికీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని టీఎస్​ ఆర్టీసీ భావించింది. కర్ఫ్యూ పరిస్థితి సద్దుమణిగే వరకు బస్సులు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. కర్ఫ్యూ కారణంగా ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సులు, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు ఎంజీబీఎస్ బస్​స్టేషన్​లోనే నిలిపివేశారు.

రెండు రాష్ట్రాల మధ్య 1400-1500 వరకు అంతరాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు నిత్యం ప్రయాణికులను చేరవేస్తుంటాయి. వీటితో పాటు ప్రైవేట్ సర్వీసులు సుమారు 900 వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. సరిహద్దు జిల్లాలైన నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన బస్సులను మాత్రం యథావిధిగా నడిపిస్తున్నారు. ఈ బస్సులు రాష్ట్ర సరిహద్దు వరకు వెళ్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

లాక్​డౌన్ తర్వాత కోలుకుని రోజువారి ఆదాయం రూ.11 కోట్లకు పైగా... వస్తున్న తరుణంలో ఏపీలో కర్ఫ్యూతో పాటు, తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించడం వల్ల నైట్ సర్వీసులు ప్రయాణికులు లేక నిలిపివేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి వచ్చే ఆదాయం సగానికి సగం పడిపోయిందని ఆర్టీసీ అధికారులు అంచనావేస్తున్నారు. ఓఆర్ 40 శాతానికి పడిపోయినట్లు లెక్కలు వేస్తున్నారు. రాత్రి సర్వీసులు నిలిపివేయడం వల్ల రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు నష్టం వాటిల్లుతున్నట్లు అధికారుల అంచనా.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి: సీఎస్​

Last Updated : May 5, 2021, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details