డ్రైవరన్నకు హాట్సాఫ్.. ప్రాణం మీదికొచ్చినా ప్రయాణికుల క్షేమం ఆలోచించి.. విధి నిర్వహణలో తన ప్రాణాల మీదికి వచ్చినా.. తమను నమ్ముకుని బస్సెక్కిన ప్రయాణికుల క్షేమాన్ని కోరుకుని.. సమయస్ఫూర్తితో వ్యవహరించాడు ఓ ఆర్టీసీ డ్రైవర్(tsrtc bus driver). ఒంట్లో ఓపిక లేకున్నా... సీట్లోనే కూలిపోతున్నా.. శక్తినంతా కూడగట్టుకుని ట్రాఫిక్‌లో.. రన్నింగ్‌లో.. ఉన్న బస్సును ఓ పక్కకు ఆపి పెద్ద ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడాడు(bus driver saves passengers). ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్(mgbs bus station)లో హైదరాబాద్ నుంచి వరంగల్(hyderabad to warangal bus)కు వెళ్లే బస్సు సిద్ధంగా ఉంది. బస్సులో దాదాపు పది మంది ప్రయాణికులు ఎక్కారు. ఈ బస్సు డ్రైవర్‌గా.. సీహెచ్ శ్రీనివాస్, కండక్టర్‌గా ప్రసన్న ఉన్నారు. కండక్టర్ ప్రసన్న.. వెళ్దామని శ్రీనివాస్‌కు సూచించింది. శ్రీనివాస్ కూడా బస్సును స్టార్ట్ చేశాడు. బస్సు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరింది. అప్పటికే ఒంట్లో కొంత నలతగా ఉందని కండక్టర్ ప్రసన్నతో శ్రీనివాస్ చెప్పాడు. కొంత దూరం వచ్చేటప్పటికీ కడుపులో నొప్పిగా ఉందంటూ.. ఇబ్బంది పడుతున్నాడు. అంతలోనే మరో నలుగురు ప్రయాణికులు కూడా బస్సెక్కారు. శ్రీనివాస్ బాధను గమనించిన కండక్టర్.. ఇబ్బందిగా ఉంటే బస్సును పక్కన ఆపమని సూచించింది. అంబర్‌పేటకు చేరుకోగానే.. ఒళ్లంతా చెమటలతో శ్రీనివాస్ తడిపోయాడు. తాను డ్రైవర్ సీట్లో కూర్చున్నాడే కానీ.. ఒపుకోలేనంత బాధ అనుభవిస్తున్నాడు.
కండక్టర్ సాయంతో..
బస్సులో ఉన్న ప్రయాణికుల గురించి ఆలోచించి.. శక్తినంతా కూడగట్టుకుని రోడ్డుపక్కన ఆపాడు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కాకుండా పూర్తిగా పక్కన ఆపాలని ప్రయత్నించినా తన వల్ల కాకపోవటంతో.. కొంచెం సైడ్ తీసుకొని ఆపేశాడు. కండక్టర్ ప్రసన్న వెంటనే స్పందించి.. ప్రయాణికుల సాయంతో డ్రైవర్ సీటు నుంచి పక్కకు తీసుకొచ్చారు. 108కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. కాల్స్ కలవలేదు. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారటం గమనించి.. అటుగా వచ్చిన ఓ ఆటోలో హుటాహుటిన తార్నాక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే శ్రీనివాస్‌కు వైద్యం ప్రారంభించారు. సమయానికి వైద్యం అందటంతో ప్రస్తుతం డ్రైవర్ శ్రీనివాస్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నాం..
"బస్సు బయలుదేరినప్పుడే కొంచెం కడుపులో నొప్పిగా ఉందని చెప్పాడు. కొంత దూరం వచ్చాక.. నొప్పి ఎక్కువైందన్నాడు. మరీ ఎక్కువగా ఉంటే.. పక్కన ఆపమని నేను చెప్పాను. ఆ తర్వాత మరో నలుగురు ప్యాసింజర్లను కూడా ఎక్కించుకున్నాడు. అంబర్‌పేట ప్రాంతానికి వచ్చాక.. తన పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. ఒళ్లంత చెమటలతో సీటులోనే కూలిపోతున్నాడు. ఆ సమయంలోనే ఓపికతో బస్సును పక్కన ఆపేశాడు. అంబులెన్స్‌కి కాల్ కలవకపోవటం వల్ల ఆటోలో ఆస్పత్రికి తీసుకొచ్చాం. పెద్దగా స్పీడులో లేకపోవటం.. శ్రీనివాస్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నాం." -ప్రసన్న, కండక్టర్
ఇదీ చూడండి:మరణించిన తల్లిని.. మళ్లీ తండ్రి చెంతకు చేర్చిన కూతురు... అదెలా సాధ్యం అనుకుంటున్నారా?