టీఆర్టీ 2017 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాలని.. అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఒకేసారి రెండు, మూడు ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒక ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల.. సుమారు రెండు వేల వరకు ఖాళీలు ఏర్పడ్డాయని వారు కమిషన్కు వివరించారు.
మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని హెచ్‌ఆర్‌సీకి వినతి
టీఆర్టీ 2017 నోటిఫికేషన్ ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టుల్లో మెరిట్ సాధించిన తమను భర్తీ చేపట్టేలా అధికారులకు ఆదేశాలివ్వాలని.. అభ్యర్థులు రాష్ట్ర హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఒకేసారి రెండు, మూడు ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒక ఉద్యోగాన్ని ఎంచుకోవడంతో.. సుమారు రెండు వేల వరకు ఖాళీలు ఏర్పడ్డాయని వారు కమిషన్కు వివరించారు.
మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని హెచ్‌ఆర్‌సీకి వినతి
ఈ ఉద్యోగాలను మెరిట్ జాబితాలో ఉన్న తదుపరి వారితో భర్తీ చేయాలని విద్యా శాఖ మంత్రి, అధికారుల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించనున్న ఉద్యోగాల కంటే ముందు.. ఖాళీగా ఉన్న పోస్టుల్లో మెరిట్ సాధించిన తమను భర్తీ చేపట్టేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వారు కమిషన్ను కోరారు.
ఇదీ చూడండి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి: ఉత్తమ్