తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఏబీవీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదు' - ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై మాట్లాడే నైతిక హక్కు ఏబీవీపీకి లేదని తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గుజరాత్, యూపీ సహా భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఆర్థికంగా వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు.

Trsv fires On Abvp On the implementation of EWS reservations
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై మాట్లాడే నైతిక హక్కు ఏబీవీపీకి లేదు

By

Published : Oct 10, 2020, 10:44 PM IST

సుప్రీంకోర్టులో కేసు ఉన్నందునే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఓబీసీలకు కూడా విద్య, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు. మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న బనారస్ యూనివర్సిటీలో ఒక్క ఓబీసీ ప్రొఫెసర్ లేరని విమర్శించారు.

నీట్ జాతీయ కోటాలో రిజర్వేషన్ అమలు చేయక పోవడం వల్ల ఓబీసీలు సుమారు 11 వేల 27 సీట్లు కోల్పోయారని ఆయన ఆరోపించారు. ఏబీవీపీ, ఎన్ఎస్​యూఐలకు చిత్తశుద్ధి ఉంటే.. జాతీయ స్థాయిలో విద్య, ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించాలన్నారు. ఎన్నికల కోసమే ఈ రాద్ధాంతం చేస్తున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి:'వానా కాలం వస్తే ఉసిల్లు.. ఎన్నికలు వస్తే కాంగ్రెస్​ నాయకులు'

ABOUT THE AUTHOR

...view details