కేంద్ర నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపై లెక్కలు చెబుతామని ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ నుంచి వెళ్లే పన్నులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. రాష్ట్రం నుంచి వెళ్తున్న డబ్బుపైనే కేంద్రం బతుకుతుందని, కేంద్ర నిధులతో తెలంగాణ బతకడం లేదని స్పష్టం చేశారు.
నగర అభివృద్ధిపై ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడారా? : ఎంపీ నామ
హైదరాబాద్ అభివృద్ధిపై భాజపా ఎప్పుడైనా పార్లమెంట్లో ప్రస్తావించిందా అని తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నించారు. కాషాయ నేతలు అబద్ధాలు, మోసపూరిత మాటలు చెబుతున్నారని ఆరోపించారు.
ఎంపీ నామ నాగేశ్వరరావు
వరదల సమయంలో సాయం చేసేందుకు రాని కేంద్ర మంత్రులంతా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్కు వస్తున్నారని నామ అన్నారు. ఆరేళ్లలో రాష్ట్రానికి, నగరానికి ఏం చేశారో భాజపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు లేఖలు రాసినా.. కనీసం ఒక్క ప్రాజెక్టు కేటాయించలేదని మండిపడ్డారు. ఐఐటీ, నవోదయ పాఠశాలలను కూడా ఇవ్వలేదని, పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడినా కేంద్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి :రేపు ఎల్బీస్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ
Last Updated : Nov 27, 2020, 12:25 PM IST