కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసినందుకు అమిత్ షా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి కీలక ప్రాజెక్టులకు కూడా ఒక్క రూపాయి కేటాయించలేదని.. తెలంగాణ ప్రజలను భాజపాలో ఎందుకు చేరాలో అమిత్ సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ కక్షపూరిత వైఖరి కేంద్ర బడ్జెట్తో బయటపడిందన్నారు.
రాజకీయ కోణాల్లోనే కేంద్ర బడ్జెట్: కర్నె ప్రభాకర్ - budget 2019
కేవలం రాజకీయ కోణాల్లోనే కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. భాజపా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ... రాష్ట్రానికి చేసింది శూన్యమేనన్నారు. బడ్జెట్లో జరిగిన అన్యాయంపై భాజపా ఎంపీలు గళమెత్తాలని డిమాండ్ చేశారు.
karne prabhakar