తెలంగాణ

telangana

ETV Bharat / city

TRS MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తెరాస అనూహ్య నిర్ణయం.. వాళ్లకే అవకాశం..! - mlc election nomination

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై తెరాస(trs mlc candidates list in telangana 2021) కసరత్తు తుది దశకు చేరింది. అభ్యర్థులను ఇవాళ ఖరారు చేసే అవకాశముంది. ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన తెరాస.. స్థానిక సంస్థల కోటాలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ అవకాశం కోసం గులాబీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

trs mlc candidates list in telangana 2021
trs mlc candidates list in telangana 2021

By

Published : Nov 21, 2021, 5:26 AM IST

Updated : Nov 21, 2021, 10:47 AM IST

రాష్ట్రవ్యాప్తంగా 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ(telangana mlc elections 2021) స్థానాలకు.... ఎల్లుండితో నామినేషన్ల(mlc election nomination) గడువు ముగియనుంది. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున స్థానాలకు, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ దిల్లీ వెళ్లేలోగా(cm kcr delhi tour) అభ్యర్థులను ఖరారు చేసి...రేపు నామినేషన్లు(mlc election nomination) వేయాలని సూచించే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు పోటీ చేసినా...తెరాస విజయం ఖాయమే కాబట్టి.. పెద్దసంఖ్యలో నేతలు ఆశిస్తున్నారు.

కవిత స్థానం మరొకరికి...

ప్రస్తుతం కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వొచ్చని తెరాసలో ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ ఎమ్మెల్సీగా వెళ్తున్నందున... ఆయన స్థానంలో కవితను రాజ్యసభ పంపించవచ్చుననే చర్చ జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు ప్రాతినిధ్యం వహిస్తుండగా... అందులో ఒక చోట ఎల్.రమణ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్‌లో పురాణం సతీష్ కుమార్‌తోపాటు శ్రీహరిరావు, అరికెల నాగేశ్వరరావు ఆశిస్తున్నారు.

సీఎం అనూహ్య నిర్ణయాలు..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలలో ఒకరిని మార్చవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖమ్మంలో బాలసాని లక్ష్మీనారాయణతోపాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గాయత్రి రవి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డి, మెదక్ నుంచి భూపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజుకు మరోసారి అవకాశం ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్‌... స్థానిక సంస్థల కోటా అభ్యర్థుల విషయంలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకునే అవకాశముందని చర్చ జరుగుతోంది.

ఇప్పటికే పలువురికి సూచనలు..

ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా అభ్యర్థిత్వాలను తెరాస బహిరంగంగా ప్రకటించలేదు. అభ్యర్థులు నేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక సంస్థల కోటా అభ్యర్థుల్లో కొందరికి ఇప్పటికే నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని తెరాస అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. నామినేషన్లు ఎల్లుండితో ముగియనుండగా.. ఈనెల 24న పరిశీలిస్తారు. ఈనెల 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ పదో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఇదీ చూడండి:

Last Updated : Nov 21, 2021, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details