"కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి" - trs mla kp vivekananda
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెరాస నేతలపై మతిస్థిమితంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. అతను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
trs mla kp vivekananda demand apology from komatireddy venkat reddy
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కేటీఆర్ అండతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు భూ కబ్జా చేస్తున్నారన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోతే కచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : 'వానర'కం చూపెడుతున్నాయి!