దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో భాజపా నేతలు అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని తెరాస ఆరోపించింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డి, ఎన్నికల కమిషన్ అదనపు సీఈవో బుద్ధ ప్రకాశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
భాజపా అల్లర్లు సృష్టించాలని చూస్తోంది: తెరాస
భాజపా నాయకులు నగరంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని తెరాస నేతలు ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి, ఈసీ అదనపు సీఈవో బుద్ధ ప్రకాశ్‌ను కలిసి... శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రోజు భాజపా కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. రేపు ప్రగతిభవన్, డీజీపీ కార్యాలయాన్ని భాజపా నేతలు ముట్టడించే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, కాలేరు వెంకటేశ్, మెతుకు ఆనంద్, తెరాస రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు వనతి పత్రం అందించిన వారిలో ఉన్నారు.
ఇదీ చూడండి:హైదరాబాద్‌లో రూ.కోటి హవాలా డబ్బు పట్టివేత