ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ... రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఓట్ల వేటలో తెరాస నేతలు జోరు పెంచారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ... పట్టభద్రులను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఖమ్మం, వరంగల్‌లోని పలు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎర్రబెల్లి... కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి భూములు కేటాయించినా.. దానిని ఉత్తరప్రదేశ్‌కు కేటాయించారని అన్నారు.
చిచ్చుపెట్టేందుకు ప్రయత్నాలు..
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి టీఎన్టీవో ఉద్యోగుల మధ్య కొంత మంది చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీవో భవన్‌లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి గంగుల పాల్గొన్నారు.
లక్షా 30 వేల ఉద్యోగాలు..