తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలంటూ ఆందోళన

ఏపీలోని విశాఖపట్నం జిల్లా మారుముల గూడెం కొత్తవీధి మండలం దుప్పులపాడు పంచాయతీ ప్రజలు నెల రోజులుగా చీకటిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ చెడిపోవడంతో.... నెల రోజులుగా విద్యుత్ సరఫరా కావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాలి డిమాండ్‌ చేశారు.

tribes-protest-to-demand-for-restoration-power-supply
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలంటూ ఆందోళన

By

Published : Jun 28, 2021, 8:11 AM IST

Updated : Jun 28, 2021, 9:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలోని మారుముల గూడెం కొత్తవీధి మండలం దుప్పులపాడు పంచాయతీ ప్రజలను నెల రోజులుగా విద్యుత్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. దుప్పలపాడు పంచాయతీ పరిధిలోని శాండికోరి, వలసగెడ్డ, వలసగెడ్డకొత్తూరు, వలసగెడ్డ కాలనీ గ్రామాలు సీలేరు జలవిద్యుత్‌ కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ నాలుగు గ్రామాలకు సీలేరు నుంచే విద్యుత్ సరఫరా జరుగుతోంది.

ట్రాన్స్‌ఫార్మర్‌ చెడిపోవడంతో.... నెల రోజులుగా విద్యుత్ సరఫరా కావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని మహిళలు వాపోయారు. విద్యుత్‌ లేనందున నీరు కూడా సరిగా సరఫరా కావడం లేదని, 3 కిలోమీటర్ల నడిచి మరీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వెంటనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాలి డిమాండ్‌ చేశారు.

ఇదీచదవండి:TPCC: రేవంత్​ నియామకంపై హస్తం పార్టీలో అసమ్మతి సెగలు

Last Updated : Jun 28, 2021, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details