నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పలు కేసులపై శుక్రవారం విచారణ జరిగింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క విచారణకు హాజరుకానందున.. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఈనెల 9లోగా వారెంట్ ఇవ్వాలని ములుగు పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రజాప్రతినిధులకు సమన్లు.. ఎందుకంటే..? - mulugu mla news
ప్రజాప్రతినిధులపై నమోదైన పలు కేసులపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరు కానందున.. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎంపీ నామ, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి వేర్వేరు కేసుల్లో కోర్టు సమన్లు జారీ చేసింది
ప్రజాప్రతినిధుల కోర్టులో పలు కేసులపై విచారణ
వేర్వేరు కేసుల్లో మంత్రులు ఎర్రబెల్లి, గంగుల, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మచ్చా నాగేశ్వరరావు కోర్టుకు హాజరయ్యారు. హెరిటేజ్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విచారణకు హాజరయ్యారు. ఎంపీ నామ, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి వేర్వేరు కేసుల్లో కోర్టు సమన్లు జారీ చేసింది.