మెట్రో పెచ్చులు ఇంకెన్ని రాలిపడతాయో...! - Metro Flats
ఆదివారం జరిగిన ఘటనలో మౌనిక మృతి మరవకముందే మెట్రో నిర్మాణంలో మరిన్ని లోపాలు బయటపడుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, రసూల్పుర మెట్రో స్టేషన్ల వద్ద పెచ్చులు కిందపడే దశకు చేరుకున్నాయి.
మెట్రో పెచ్చులకు ప్రయాణికుల్లో గుబులు
అమీర్పేట్ మెట్రో రైల్వే స్టేషన్లో నిన్న పెచ్చులు ఊడిపడి మౌనిక చనిపోయిన ఘటన మరువకముందే మెట్రోలో మరిన్ని లోపాలు బయట పడుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి, రసూల్పుర మెట్రో స్టేషన్ పైభాగంలో పెచ్చులు ఊడి కిందపడే దశకు చేరుకున్నాయి. దీని వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.