తెలంగాణ

telangana

ETV Bharat / city

అవినీతి అధికారి ఆస్తులెన్నో

వికారాబాద్​ జిల్లా రవాణ సంస్థ కార్యాలయం కార్యనిర్వాహక అధికారి అవినీతి కేసులో మరో ఇద్దర్ని అనిశా అధికారులు అరెస్టు చేశారు. నిన్న వాహన రిజిస్ట్రేషన్​ కోసం రమేశ్​ అనే వ్యక్తి వద్ద లంచం తీసుకుంటుండగా ప్రవీణ్​ కుమార్​ ఏసీబీకి చిక్కారు.

నిందితులు

By

Published : May 24, 2019, 5:14 AM IST

అవినీతి అధికారి ఆస్తులెన్నో

వాహన రిజిస్ట్రేషన్​ కోసం రమేశ్​ అనే వ్యక్తి వద్ద రూ.10 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కారు వికారాబాద్​ జిల్లా రవాణ సంస్థ కార్యాలయం కార్యనిర్వాహక అధికారి ఎ.ప్రవీణ్​ కుమార్​. ఈ కేసులో మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్ల అక్రమ దందాలో ఏఓతోపాటు రవీందర్‌, ఆదిల్ అనే ఇద్దరు దళారులు కూడా ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కొత్తపేటలో ఏఓ నివాసంలో సోదాలు చేయగా... 48.5 లక్షల రూపాయల నగదు, ఇంటి పత్రాలు, నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిపర్తి వద్ద 4.5 ఎకరాల వ్యవసాయ భూమి దస్త్రాలు, నిజామాబాద్‌లో విలువైన రెండు ఇళ్ల స్థలాలకు సంబంధించి దస్త్రాలు, బ్యాంకులో డబ్బు నిల్వలు, బంగారు ఆభరణాలు దొరికాయి.

వాటిని అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టు, అక్రమ ఆస్తుల వివరాలను నాంపల్లి అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణతో కలిసి ఉప సంచాలకులు మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. ఏఓ ప్రవీణ్‌కుమార్ కేసు దర్యాప్తులో ఆదాయానికి మించి 2.25 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులున్నట్లు గుర్తించిన దృష్ట్యా నిందితులపై డీఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: కారుకు పదహారు కాదు... తొమ్మిదే..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details