30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో అన్నిశాఖల్లోకెల్లా విద్యుత్ శాఖ అద్భుతంగా సేవలందించి ప్రథమస్థానంలో నిలవడం పట్ల జెన్ కో – ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షలో విద్యుత్ శాఖ నంబర్ వన్‌గా నిలిచినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తమ సిబ్బంది రేయింబవళ్లూ పనిచేసి, అన్ని పనులు పూర్తి చేశారని అభినందించారు. విద్యుత్ సిబ్బంది సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్‌కు ప్రభాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి, భవిష్యత్తులో సంబంధిత సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని సీఎండీ చెప్పారు.
విద్యుత్ శాఖ నంబర్‌వన్‌గా నిలవడంపై ట్రాన్స్‌కో సీఎండీ హర్షం - power department number one in 30 days plan
పల్లె ప్రగతి కార్యక్రమంలో విద్యుత్ శాఖ నంబర్‌వన్‌గా నిలిచినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జెన్ కో – ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి, భవిష్యత్తులో విద్యుత్ సంబంధిత సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని సీఎండీ చెప్పారు.
transco cmd