Revanth Reddy Tested Corona Positive : మరోసారి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్ - revanth tested covid positive
08:46 January 03
మరోసారి కరోనా బారినపడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
Revanth reddy tested covid positive : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి కరోనా బారినపడ్డారు. ఆదివారం నుంచి జ్వరంతోపాటు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని రేవంత్ ట్విటర్లో వెల్లడించారు. ఈ లక్షణాలతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.
Corona Positive for Revanth Reddy : కొవిడ్ మహమ్మారి, ఒమిక్రాన్ వేరింట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచించారు. ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉన్నానని ట్వీట్ చేశారు. గతేడాది మార్చిలోనూ రేవంత్‌కు కరోనా సోకింది.
రేవంత్‌రెడ్డి ఇవాళ కోర్టులో హాజరుకావాల్సి ఉండగా పాజిటివ్ నిర్దారణ అయ్యినందున హాజరుకాలేనని ఓ మెమో దాఖలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. కొవిడ్ లక్షణాలు తీవ్రంగా లేకపోయినా జ్వరం, స్వల్పంగా జలుబు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎవరిని కలువద్దని బయట తిరగొద్దని.. ఇంటికే పరిమితం కావాలని వైద్యులు సూచించడంతో జూబ్లీహిల్స్‌లోని నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.