తెలంగాణలో పట్టభద్రుల మండలి ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై పీసీసీ ఏడుగురు సీనియర్లతో ఓ కమిటీ వేసింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, అజారుద్దీన్లను సభ్యులుగా నియమించింది.
'పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు..జీవన్ రెడ్డి నేతృత్వంలో కమిటీ' - Telangana Pradesh Congress Committee
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం పీసీసీ ఏడుగురు సీనియర్ నాయకులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వం వహించనున్నట్లు ప్రకటించింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ కమిటీ
జీవన్ రెడ్డి కమిటీ.. రెండు మండలి స్థానాలకు ఆశావహులను పరిశీలించి ఎంపిక చేసిన పేర్లను అధిష్ఠానానికి సిఫార్సు చేస్తుందని పీసీసీ పేర్కొంది. ఈ కమిటీ సిఫార్సు ఆధారంగానే కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.