పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సోనియాగాంధీ... ప్రస్తుతం పార్టీకి పునరుత్తేజం తెస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలిగా మరోసారి ఎంపికవడం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రజల మనసులో ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ఉత్తమ్ అన్నారు. సోనియాగాంధీ నాయకత్వంలో రానున్న రోజుల్లో రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోనియాగాంధీ ఎన్నికతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం పుంజుకుందని ఏఐసీసీ సభ్యులు నిరంజన్ తెలిపారు.
సోనియా ఎన్నిక పట్ల టీ-కాంగ్రెస్ శ్రేణుల హర్షం - komatireddy
సోనియాగాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి పునరుత్తేజం తీసుకొస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
సోనియా ఎన్నిక పట్ల టీ-కాంగ్రెస్ శ్రేణుల హర్షం
Last Updated : Aug 11, 2019, 7:56 AM IST