తెలంగాణ

telangana

REVANTH: 'మూడెకరాలు ఇస్తామని.. ఉన్నవి లాక్కుంటున్నారు'

By

Published : Jul 31, 2021, 8:22 PM IST

హుజూరాబాద్​ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తెచ్చారని టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి​ ఆరోపించారు. దళిత, గిరిజనులకు ఆత్మగౌరవం కల్పించడంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, భూములు పంచింది.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో పీసీసీ కార్యవర్గ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ దళితుల, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని... ఆయన పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేసిన నిధులు ఎన్నో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

REVANTH:  'హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు పథకం తెచ్చారు'
REVANTH: 'హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు పథకం తెచ్చారు'

REVANTH: 'హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు పథకం తెచ్చారు'

ఇందిరమ్మ రాజ్యంలో లక్షలాది మంది ఎస్టీలు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటే... కేసీఆర్ పాలనలో గిరిజనులపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ పోడుభూములను లాక్కుంటున్నారని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్​ గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో పీసీసీ కార్యవర్గ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్​తో పాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, తదితరులు పాల్గొన్నారు. దళితులు, గిరిజనులకు చట్టపరమై హక్కులు కల్పించింది కాంగ్రెస్సేనని రేవంత్​ రెడ్డి అన్నారు.

హుజూరాబాద్​ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తెచ్చారని రేవంత్​ ఆరోపించారు. దళిత, గిరిజనులకు ఆత్మగౌరవం కల్పించడంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, భూములు పంచింది.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు. ఉద్యోగాలు, చదువుల్లో రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని గుర్తు చేశారు. ఏడు సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో దళిత, గిరిజనులను ప్రగతి భవన్ మెట్లు ఎక్కనివ్వలేదని విమర్శించారు. కేసీఆర్ దళితుల, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని... ఆయన పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేసిన నిధులు ఎన్నో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. దళిత బంధు పథకాన్ని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని... రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు.

నిధులు లేకపోతే.. ప్రగతి భవన్, సెక్రటేరియట్ భూములను అమ్మైనా సరే దళితబంధు ఇవ్వాలని కోరారు. అందరికీ దళిత బంధు ఇవ్వకుండా ఎవరు అడ్డుపడ్డారంటూ రేవంత్​ ప్రశ్నించారు. ఎవరి పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. దళితుల, గిరిజనుల హక్కుల కోసం ఆగస్టు 9న ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించబోతున్నామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో దళితబంధు అమలు కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష మందితో దళిత గిరిజన దండోరా నిర్వహించి 'ఇస్తావా..చస్తావా' అనే నినాదంతో పోరాటం చేస్తామని రేవంత్​ స్పష్టం చేశారు.

ఎన్నికల కోసమే..

'ఇందిరమ్మ రాజ్యంలో లక్షలాది మంది ఎస్టీలు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటే కేసీఆర్ పాలనలో గిరిజనులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ పోడుభూములను లాక్కుంటున్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పథకం తెచ్చారు. కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేసిన నిధులు ఎన్నో శ్వేత పత్రం విడుదల చేయాలి. దళిత బంధు 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం చేయాలి. నిధులు లేక పోతే .. ప్రగతి భవన్, సెక్రటేరియట్ భూములను అమ్మైనా సరే దళితబంధు ఇవ్వాలి. అందరికీ దళిత బంధు ఇవ్వకుండా ఎవరు అడ్డుపడ్డారు.

-రేవంత్​ రెడ్డి, టీపీసీసీ చీఫ్​

ఆ ఘనత కాంగ్రెస్​దే: భట్టి విక్రమార్క

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. దేశంలో భూముల పంపిణీ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఎస్టీలకు భూముల పంపిణీ జరుగుతుందని అందరూ ఆశించారని.. కానీ కేసీఆర్ భూములు ఇవ్వక పోగా.. లాక్కుంటున్నారని మండిపడ్డారు. పోడు భూములపై హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.

ఇదీ చదవండి: RS PRAVEEN KUMAR: 'లక్షల మంది గుండెల్లో నేనున్నా.. ఏం చేస్తారు?'

ABOUT THE AUTHOR

...view details